Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోండి

కృష్ణరాయపురంలో ఆక్రమిత చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, రెవెన్యూ అధికారులు

రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

పెందుర్తిరూరల్‌, నవంబరు 27: ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు, వాగులను ఆక్రమిస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక  కార్పొరేటర్‌ ముమ్మన దేముడు, రెవెన్యూ అధికారులతో కలిసి 95వ వార్డు కృష్ణరాయపురంలోని ఆక్రమిత వెంకటప్ప చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. కొందరు చెరువు గర్భాన్ని పూడ్చేసి స్థలాన్ని చదును చేస్తున్నారని ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. తక్షణమే ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు, స్థలాల పరిరక్షణపై రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ పైలా రామారావు, వైసీపీ నాయకులు ఆదిరెడ్డి మురళి, అంగటి సూరిబాబు, ఎల్బీ నాయుడు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


Advertisement
Advertisement