Abn logo
Apr 2 2020 @ 06:48AM

నటిని కాకుంటే గొంతు మీద కూడా టాటూ : ప్రముఖ నటి

తాప్సీ పన్నూ బాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్ అని నిరూపించుకున్నారు. తాప్సీ మొదట పింక్ చిత్రంతో తన ప్రత్యేక ప్రతిభను లోకానికి చూపారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించారు. ఆ చిత్రంలో తాను పోషించిన మీనాల్ పాత్ర తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని తాప్సీ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇటీవల ఆమె మీనాల్ వేసుకున్న పచ్చబొట్టు గురించి  వివరించారు. మీనాల్ ఉంటున్న పరిస్థితులకు సరిపోయే డిజైన్‌ను రూపొందించామని తెలిపారు. రెక్కలతో చాలా ఎత్తుకు ఎగరాలని కోరుకునే పక్షి ప్రతిరూపం అది అని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది అమ్మాయిలు ఇటువంటి పచ్చబొట్టు వేయించుకున్నారన్నారు. తనకు పచ్చబొట్లు అంటే చాలా ఇష్టమని, ఎవరైనా  సరే వారు ఎంతో ఆలోచనాత్మకంగా పచ్చబొట్టు వేయించుకుంటారన్నారు. తన శరీరంపై  రెండు పచ్చబొట్లు ఉన్నాయన్నారు. తాను నటన వృత్తిలో లేకుంటే, ఖచ్చితంగా మెడపై పచ్చబొట్టు వేయించుకునే దానిని అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement