Oct 13 2021 @ 11:20AM

Taapsee pannu బాడీపై చేసిన ఆ కామెంట్స్ చూసి షాకయ్యా: అభిషేక్

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చిన తాప్సీ పన్ను అక్కడ ప్రముఖ కథానాయికగా ఎదిగింది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం `రష్మీ రాకెట్`. మహిళా అథ్లెట్ జీవితకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 15న `జీ5`లో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం తాప్సీ కఠినమైన కసరత్తులు చేసి అథ్లెటిక్ బాడీ సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటుడు అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించాడు. 


తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరైన అభిషేక్.. తాప్సీ బాడీ గురించి వచ్చిన కామెంట్లపై స్పందించాడు. ``రష్మీ రాకెట్` సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినపుడు.. మగవాడి శరీరంలా ఉందని చాలా మంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు విని నేను షాకయ్యా. ఎందుకంటే మేం అలాంటి కామెంట్లనే ఆశిస్తున్నాం. ఈ సినిమాలో కథానాయిక టెస్టొస్టిరాన్ (పురుష హార్మోన్) అధికంగా విడుదలయ్యే సమస్యతో బాధపడుతుంటుంది. అలాంటి సమస్యతో బాధపడుతున్న మహిళా అథ్లెట్ ఓ వ్యవస్థపై చేసే పోరాటమే ఈ సినిమా` అని అభిషేక్ చెప్పాడు. 

Bollywoodమరిన్ని...