Abn logo
Nov 30 2020 @ 16:15PM

నాకు బికినీ నచ్చదు: తాప్సీ

దక్షిణాదిన గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఉత్తరాదిన మాత్రం మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. వరుసగా మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. హిందీలో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల వెకేషన్‌కు మాల్దీవులు వెళ్లి వచ్చిన తాప్సీ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడింది. 


అందంగా కనిపించడమంటే స్కిన్ షో చేయడం కాదని పేర్కొంది. `స్కిన్ షో విషయంలో నేను కొన్ని నియమాలు పెట్టుకున్నా. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల్లో నేను బికినీలో కనిపించా. అయితే ఆ డ్రెస్ నాకు సౌకర్యంగా అనిపించలేదు. అభిమానులు కూడా నన్ను బికినీలో చూడడానికి ఇష్టపడరు. అందంగా కనిపించడమంటే అంగాంగ ప్రదర్శన చేయడం కాద`ని తాప్సీ పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement