Abn logo
Jul 7 2020 @ 03:24AM

టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా?

దాదాపు ఖాయమన్న ఆసీస్‌ మీడియా

సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌క్‌పపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ అదుపులోకి రాకపోవడంతో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగాల్సిన వరల్డ్‌క్‌పను వాయిదా వేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఐసీసీ మాత్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడుతుందని కూడా వెల్లడించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో 16 దేశాల జట్లను ఒక్కచోటికి చేర్చి టోర్నీని నిర్వహించడం అసాధ్యమని క్రికెట్‌ ఆస్ట్రేలియా చైర్మన్‌ ఎర్ల్‌ ఎడ్డింగ్‌ గతంలోనే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement