రామలక్ష్మి వీవర్స్ కాలనీలోని డ్రెయిన్‌ను శుభ్రం చేయిస్తున్న కమిషనర్
పెడన : చెత్త సేకర ణకు పారిశుధ్య కార్మికులు రావడం లేదని స్థానిక పోలవరపుపేట ప్రజలు కమిషనర్ అంజయ్యకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ పోలవరపు పేట వెళ్లి పారిశుధ్య కార్మికులను పిలిపించి మందలించారు. రోజూ ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిం చకపోతే తగిన చర్యలు తీసుకుం టామని కమిషనర్ హెచ్చరించారు. రామలక్ష్మి వీవర్స్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మేజర్ డ్రెయిన్‌ను కమిషనర్ శుభ్రం చేయించారు.