Abn logo
Jun 19 2021 @ 20:18PM

త్వరలో పాలక మండళ్ల నియామకం

రాపూరు, జూన్‌ 19: పెంచలకోన ఆలయం, రాపూరు ఏఎంసీలకు త్వరలో పాలకమండళ్లను  ఏర్పాటు చేయనున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.  మండలంలో శనివారం పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.  మండల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద సంస్థకు  అప్పగించినా పనులు పూరి ్తకాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికైనా పనులు పూర్తిచేయాలన్నారు. ఎస్‌ఎస్‌ కెనాల్‌, సంకురాత్రిపల్లి ఎత్తిపోతల, వైఎస్‌ఎస్‌ఆర్‌ భారీ విగ్రహం ఏర్పాట్లు అతి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఎన్‌డీసీసీ బ్యాంకు డైరెక్టరు చెన్ను బాలకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.