Abn logo
Sep 18 2021 @ 00:31AM

పరిగి కేజీబీవీ ఎస్‌ఓపై సస్పెన్షన వేటు

హిందూపురం టౌన, సెప్టెంబరు 17: పరిగి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) ప్రత్యేకాధికారి (ఎస్‌ఓ) రమాదేవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పాఠశాలలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. గత వారంలో పాఠశాలలోని పాత వస్తువులను ఉన్నతాధికారులకు తెలియకుండా విక్రయించారని విద్యార్థుల తల్లిదండ్రులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయించిన సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌.. ఆరోపణలు రుజువవడంతో ఎస్‌ఓ రమాదేవిని సస్పెండ్‌ చేశారు. దీంతో మ్యాథ్స్‌ టీచర్‌ సువర్ణమ్మను ఇనచార్జ్‌ ఎస్‌ఓగా నియమిస్తూ ఎంఈఓ లక్ష్మీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.