Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 30 2021 @ 16:51PM

యాదాద్రిలో ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవలు నిలిపివేత

యాదాద్రి: పట్టణంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో శ్రీ స్వామి వారికి జరిగే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవలను నిలిపివేశారు. భక్తులకు లఘు దర్శనంను మాత్రమే అలయ అధికారులు కల్పిస్తున్నారు. ఆలయ ఉద్యోగులకు, స్థానికులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన 5 రోజుల్లోనే 78 మంది ఆలయ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో కరోనా కేసులు పెరుగుతుండడంతో యాదాద్రిలో రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా దుకాణాల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు.   

Advertisement
Advertisement