Abn logo
Aug 6 2021 @ 17:38PM

ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి.. 7నెలలుగా మృతదేహాన్ని..

వాషింగ్టన్: అమెరికాలో 37ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అంతేకాకుండా ఆ మృతదేహాన్ని గత ఏడు నెలలుగా ఇంట్లోనే దాచి ఉంచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిచిగాన్ రాష్ట్రానికి చెందిన 37ఏళ్ల మాథ్యూ లెవిన్స్కీ క్లింటన్ టౌన్షిప్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కాగా.. గత ఏడాది డిసెంబర్‌లో మాథ్యూ.. తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా.. చర్మాన్ని పూర్తిగా తొలగించి, ఆ మృతదేహంతో దాదాపు ఏడు నెలలుగా ఇంట్లోనే దాచి ఉంచాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా మాథ్యూ ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో మృతదేహం బయటపడటంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మాథ్యూని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్లింటన్ టౌన్‌షిప్ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. మాథ్యూకు జైలు శిక్ష విధించింది. 


అమెరికా నగరాల్లోమరిన్ని...