Abn logo
Aug 2 2021 @ 00:04AM

తల్లి, కుమార్తెల ఆత్మహత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

మొగల్తూరు, ఆగస్టు 1 : తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి కేసులో రెండేళ్ల తరు వాత ఆడపడుచు దంపతులను ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ ఎస్‌.ప్రియ కుమార్‌  తెలిపిన వివరాల ప్రకారం.మొగల్తూరుకు చెందిన నల్లమిల్లి లక్ష్మీప్రసన్న, ఆమె ఇద్దరు కుమార్తెలు 2019 ఫిబ్రవరి 18న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి భర్త వీరాంజనేయ రెడ్డి, ఇద్దరు ఆడపడుచులు, వారి భర్తలు కారణమని అప్పటిలో కేసు నమోదు చేశారన్నారు.గతంలోనే భర్త, ఆడ పడుచు,ఆమె భర్తను అరెస్ట్‌ చేయగా మరో ఆడపడుచు, భర్త పరారీలో ఉన్నా ర న్నారు.ఈ నెల 31నఆడపడుచు కర్రి పద్మావతి ఆమె భర్త రామకృష్ణారెడ్డిలు పెనుగొండలో ఉన్నారనే సమాచారంతో సీఐశ్రీనివాస్‌ యాదవ్‌ అరెస్ట్‌ చేశారన్నారు.