Abn logo
Jul 15 2020 @ 09:09AM

సుశాంత్‌ను పేరుపై స్టార్‌.. అంతా అబ‌ద్ద‌మా!!

బాలీవుడ్ యువ క‌థానాయకుడు సుశాంత్ నెల‌రోజుల ముందు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో ఆయ‌న అభిమానులు బాధ‌లో మునిగిపోయారు. అమెరికాకు చెందిన ర‌క్ష అనే అభిమాని తానొక స్టార్‌ను కొనుగోలు చేసి దానికి సుశాంత్ పేరు పెట్టాన‌ని తెలియ‌జేస్తూ దానికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌ను కూడా జ‌త చేశారు. ర‌క్ష అభిమానానికి అంద‌రూ షాక‌య్యారు. అయితే ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ ఖ‌గోళ స‌మాజ్య‌కు చెందిన ఓ శాస్త్ర‌వేత్త మాట్లాడుతూ ‘‘ప్ర‌పంచంలో ఏ సెల‌బ్రిటీ పేరును న‌క్ష‌త్రాల‌కు పెట్టాలంటే ఆ హ‌క్కు అంత‌ర్జాతీయ స‌మాఖ్య‌కు మాత్ర‌మే ఉంటుంది. చాలా మంది త‌మ‌కు న‌చ్చిన పేర్ల‌ను తార‌ల‌కు పెట్టిన‌ట్లు ప్రచారం చేసుకుంటున్నారు’’ అని తెలిపారు. దీంతో న‌క్ష‌త్రానికి సుశాంత్ పేరుని పెట్టార‌న‌డంలో నిజం లేద‌ని రుజువైన‌ట్లేగా!.

Advertisement
Advertisement
Advertisement