Abn logo
Sep 27 2020 @ 10:05AM

ప్రమాదకర స్థాయిలో వేములేరు వాగు

సూర్యాపేట: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకవీడు మండలం రాఘవాపురం గ్రామంలో వేములేరు వాగు ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. దీంతో మఠంపల్లి నుండి దామరచర్లకు  రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతికి వాగు ఒడ్డున ఉన్న కరెంటు స్తంభం విరిగిపడింది. మీగడంపహాడ్ తండా, రాఘవపురం గ్రామాలకు రాత్రి నుండి  విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement