Abn logo
Jul 15 2020 @ 10:45AM

వెబ్ సిరీస్‌లో సూర్య‌!!

త‌మిళ హీరో సూర్య‌కు తెలుగులోనూ ఆద‌ర‌ణ ఉంది. ఆయ‌న అనువాద సినిమాల‌కు ఇక్క‌డ కూడా మార్కెట్ ఉంది. దీంతో సూర్య సినిమాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల‌వుతుంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వెండితెర‌కు, బుల్లితెర‌(మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు త‌మిళ వెర్ష‌న్‌)కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన సూర్య ట్రెండ్‌కు త‌గిన‌ట్లు  త్వ‌ర‌లోనే డిజిటల్ మాధ్య‌మంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం. వివ‌రాల మేర‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తొమ్మిది ఎపిసోడ్స్‌తో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించ‌బోతున్నార‌ట‌. అందులో ఓ ఎపిసోడ్‌లో హీరో సూర్య న‌టిస్తార‌ని టాక్‌. ఈ వెబ్ సిరీస్‌కు ‘న‌వ‌ర‌స’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. మ‌ణిర‌త్నంతో క‌లిపి తొమ్మిది మంది ద‌ర్శ‌కులు.. అంటే ఒక్కో ద‌ర్శ‌కుడు ఒక్కొక్క ఎపిసోడ్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement