Abn logo
May 28 2020 @ 23:05PM

సూర్య సినిమాల్లో జరిగినట్టే జరుగుతోంది

సూర్య నటించిన ‘సెవెన్త్ సెన్స్’, ‘బందో బస్త్’ చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను సేమ్ టు సేమ్ ఆ చిత్రాలలో ఉన్న మెయిన్ కాన్సెఫ్ట్ రూపంలోనే ఉన్నాయని అంగీకరించకమానరు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సెవెన్త్ సెన్స్’ చిత్రంలో చైనా ఓ వైరస్‌ను ఇండియాపై ప్రయోగించడం, ఆ వైరస్‌తో భారత్‌లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనే కాన్సెఫ్ట్ ప్రస్తుత కరోనాకు చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా అనే కాదు దాదాపు అదే అని చెప్పవచ్చు. కాకపోతే భారత్ ఒక్కటే కాకుండా దాదాపు ప్రప్రంచ దేశాలన్నీ ఈ వైరస్ బారిన పడటమే ఇక్కడ కొత్త విషయం. 


ఇక కరోనానే కాకుండా మరో సమస్య ఇప్పుడు భారత్‌ను వేధిస్తుంది. అదే ‘మిడతల దండు’. సూర్య హీరోగా కె.వి. ఆనంద్ దర్శకత్వంలో ‘బందోబస్త్’ అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో కూడా విలన్ ‘మిడతల దండు’ను ప్రయోగించి భారత్‌లో తను పొందాలనుకున్నది పొందే ప్రయత్నం చేస్తాడు. సేమ్ టు సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన మిడతల దండు.. భారత్‌లోని పంటపొలాన్ని నాశనం చేసేస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ తమిళ హీరో సూర్యనే. ఈ రెండు చిత్రాల ప్రస్తావన ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఈ రెండు సమస్యలను భారత్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement