సురేశ్ గోపీ - విజయ్‌ఆంటోనీ చిత్రం

‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. తాజాగా ఆయన మరో ప్రయత్నం చేస్తున్నారు. సినిమా పేరు ‘తమిళరసన్’. ఇందులో విజయ్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. యస్.యస్.యస్. మూవీస్ బ్యానర్ పై బాబూ యోగేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మాలీవుడ్ విలక్షణ నటుడు సురేశ్ గోపీ డాక్టర్ గా నటిస్తున్నారు. శంకర్ ‘ఐ’ సినిమా తర్వాత సురేశ్ గోపీ నటిస్తున్న రెండో తమిళ చిత్రం ఇదే. అంతేకాదు... ‘ఐ’ చిత్రంలో డాక్టర్ గా నటించిన ఆయన మళ్ళీ ఇందులో డాక్టర్ గానే నటించనుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.  సురేశ్ గోపీ కూడా తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశారు.


రమ్యా నంబీశన్, సోనూ సూద్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కోవిడ్ కారణంగా విడుదల లేట్ అయింది. ఈ నెల్లోనే విడుదల కాబోతున్న ‘తమిళరసన్’ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఒక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా  పోలీసాఫీసర్ తమిళరసన్ కి డాక్టరైన సురేశ్ గోపీ సాయపడతారు.  ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశం. మరి ఈ సినిమాతోనైనా విజయ్ ఆంటోనీ మంచి సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. 

Advertisement