Abn logo
Jun 2 2020 @ 04:04AM

పొగాకు రైతులను ఆదుకోండి

ఉండవల్లి, జూన్‌ 01 : జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు చేసిన పొగాకు పంట దిగుబడులను మొత్తం వీఎస్టీ కంపెనీ వారు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ జీకే ఈదన్న ఆధ్వర్యంలో 200 మంది రైతులు సోమవారం మండలంలోని డి బూర్దిపాడులో ఉన్న వీఎస్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.


తాము 50 ఏళ్ల నుంచి పొగాకును విక్రయిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది దిగుబడి అధికంగా వచ్చిందని, కంపెనీ స్పందించి మొత్తం కొనాలని కోరారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ రైతుల డిమాండ్లను పై అధికారుల దృష్ఠికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దేవదాస్‌, రైతులు చాంద్‌బాష, నాగశేషన్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement