Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి రైతులకు గూడూరు టీడీపీ సంఘీభావం

గూడూరు, డిసెంబరు 2: రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్న రైతులకు టీడీపీ సంఘీభావం తెలుపుతోందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మహాపాదయాత్రపై నియోజకవర్గంలోని నాయకులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాపాదయాత్ర శనివారం తిప్పవరప్పాడు జంక్షన్‌లోకి వస్తుందన్నారు. అక్కడ వారికి స్వాగతం పలికి గొల్లపల్లి వరకు పాల్గొంటామన్నారు. శనివారం రాత్రి గొల్లపల్లిలో రైతులు బస చేస్తారన్నారు. ఆదివారం ఉదయం వెంకటగిరి నియోజవర్గంలోని బాలాయపల్లి మండంలోని వెళతారన్నారు.  నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రకు మద్దతుగా నిలవాలన్నారు. ఎన్ని ఆటంకాలొచ్చినా అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్‌రెడ్డి, గణపర్తి కిషోర్‌నాయుడు, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, సర్వోత్తమరెడ్డి, కొండూరు వెంకటేశ్వర్లురాజు, మట్టం శ్రావణి, కోటేశ్వరరావు, పెంచలయ్య, మల్లికార్జున్‌నాయుడు, ఇశ్రాయిల్‌కుమార్‌, జలీల్‌, మువ్వా చరణ్‌, చంద్రమౌళి, భారతి, లీలావతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదు

డక్కిలి : అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు ఆటంకాలు కల్పించడం  మండల టీడీపీ అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు అన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో  పాదయాత్రను జయప్రదం చేయడంపై గురువారం మోపూరు క్రాస్‌రోడ్డులో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అమరావతి రైతుల పాదయాత్రలో వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.  మండల టీడీపీ అధికార ప్రతినిధి ఆరికట్ల శ్రీరాములు, ప్రచారకార్యదర్శి కుమార్‌, నాయకులు అయ్యపరెడ్డి, అంకయ్య, హరినాథ్‌, మచ్చల వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement