టాలీవుడ్లో ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కే కాస్ట్లీ కారవాన్ ఉందని టాక్ ఉంది. ఆ కారవాన్ ఇటీవల 'పుష్ప' షూటింగ్ నుంచి వస్తూ యాక్సిడెంట్‌కి గురైన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఖరీదైన కారవాన్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కారవాన్‌కి సంబంధించిన వివరాలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అత్యాధునిక హంగులతో ఈ కారవాన్ రెడీ అయినట్లుగానూ, ఇంటీరియర్ డిజైన్ కోసం ముంబైకి చెందిన ఓ ప్రముఖ కంపెనీ వర్క్ చేసిందని టాక్. అంతేకాదు ఈ కారవాన్ కోసం మహేష్ భారీగా ఖర్చు పెట్టారని కూడా అంటున్నారు. మహేష్ ఈ కారవాన్‌కి పెట్టిన ఖర్చు తెలిస్తే.. ఇంత కాస్ట్లీ కారవాన్.. టాలీవుడ్లో ఏ హీరోకి లేదని చెబుతూ.. మహేష్ అభిమానులు కారవాన్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. రాసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ కారవాన్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. 'గీతగోవిందం' దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' షూటింగ్‌తో మహేష్ బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా బ్రేక్ పడిన ఈ చిత్ర షూటింగ్.. ఇటీవలే మొదలై... గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత మహేష్.. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు కూడా జరుగుతున్నాయి.