Abn logo
Sep 28 2020 @ 00:41AM

శూన్యయానం

Kaakateeya


రాత్రి - నన్ను ముక్కలు చేస్తోంది

       ఒక్కో ముక్కలోకి ఒక్కో 

       స్వప్న శకలాన్ని కూరుతూ


రాత్రి - నన్ను ఎడతెగని ప్రయాణానికి

       సన్నద్ధుణ్ని చేస్తోంది,

       ఒక్కో మజిలీ వద్దకీ

       కొన్ని ఆలోచనలు పంపి 

       శూన్యావరణాన్ని రద్దు చేస్తూ


అయినా, శూన్యమొక అయిస్కాంతం

శూన్యమొక బిలం

శూన్యం ఒక సుడిగుండం


శూన్యానిన్న కట్టిన 

తారీఖుల కంచె కదా కాలం

శూన్యం మెడలో 

అంకెల మాల కదా కాలం


అందుకే,

కాలం పోటుతో

ప్రకటితమైన ‘పగలు’ అనే 

మహా శూన్యంలోకి 

మళ్లీ, మళ్లీ జారిపోతూనే ఉన్నాను

- ఒక ‘నిరంతరాన్వేషణ’లో.

మల్లారెడ్డి మురళీ మోహన్‌

88611 84899


Advertisement
Advertisement
Advertisement