Abn logo
Apr 2 2020 @ 07:19AM

లాక్ డౌన్ లో సన్నీ లియోన్ ఏమి చేస్తున్నదంటే...

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు. మార్కెట్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, జిమ్‌లు మొదలైనవాటిని మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి పరిస్థితిలో చాలా మంది నటులు ఫిట్ నెస్ కోసం అధిక సమయం వెచ్చిస్తున్నారు. నటి సన్నీ లియోన్ ఇంట్లో వ్యాయామాలు చేస్తున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల మధ్య ఫిట్ గా ఎలావుండాలో తెలియజేస్తున్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటానికి పలు సూచనలు చేశారు. "జంక్ ఫుడ్స్ తక్కువగానే తినండి. ఆరోగ్యకరమైన చిరుతిండికి ప్రాధాన్యత ఇవ్వండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి. రోజంతా చిన్నచిన్న వర్కౌట్స్ చేయండి. ఇదే  కాకుండా శారీరకంగా కష్టపడి పనిచేసే ఇంటి పనులపై కూడా శ్రద్ధ చూపాలని" సూచించారు.

Advertisement
Advertisement
Advertisement