Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సుంకర పద్మశ్రీ

విజయవాడ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ  అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శీతాకాల సమావేశాల్లోనే బిల్లులను వెనక్కి తీసుకుంటామని చెప్పడం సంతోషమన్నారు. చట్టాలపై అలుపెరుగకుండా రైతులు చేస్తున్న పోరాటానికి దక్కిన విజయమని ఆమె అభివర్ణించారు. అలాగే ఏపీలో అమరావతి రాజధాని కోసం విశ్రమించని పోరాటం చేస్తున్న రైతులను కూడా కేంద్రం గుర్తించాలని కోరారు. ‘‘ప్రధాని మోదీ గారు... మీరు శంఖుస్థాపన చేసిన రాజధానిని మీరే కాపాడాలి.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకొనేలా ముఖ్యమంత్రి జగన్‌కి మీరే చెప్పాలని’’ సుంకర పద్మశ్రీ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement