Abn logo
Oct 31 2020 @ 17:50PM

భలే భయపెట్టావ్ భయ్యా అంటున్నారు: సునీల్‌

Kaakateeya

సుహాస్, చాందిని చౌదరి జంటగా నూతన దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన చిత్రం 'కలర్ ఫోటో'. అక్టోబర్ 23న ఆహా ఓటీటీలో ఈ చిత్రం విడుదలైంది. సునీల్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్  బ్యానర్‌పై సాయి రాజేష్ నీలం, బెన్నీ నిర్మించారు. తొలివారంలో ఈ చిత్రాన్ని 7 లక్షల మంది చూసినట్లుగా తెలుపుతూ.. చిత్ర సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది కలర్‌ ఫొటో చిత్రయూనిట్‌.


ఈ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమంలో నటుడు సునీల్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం అంతా యంగ్ స్టర్స్‌ పని చేశారు. వాళ్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నేను ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. అంతా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో వాళ్లు చెప్పినట్లే చేశాను. కలర్ ఫోటో చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి. కొట్టకుండా.. తిట్టకుండా.. చంపకుండా భలే భయపెట్టావ్ భయ్యా అంటూ అంతా ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. అక్కడే నా పాత్ర సక్సెస్ అయ్యిందనేది అర్థమైంది. ఇండస్ట్రీకి నేను వచ్చిందే విలన్ అవుదామని.. కానీ మనలో ఏదో కామెడీ సెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు కలర్ ఫోటోతో విలన్ కల కూడా నెరవేరింది. ఈ సినిమాకు గుండె చప్పుడు అంటే కాల భైరవ మ్యూజిక్. సందీప్ రాజ్ చాలా బాగా డిజైన్ చేశాడు. హర్ష కామెడీ టైమింగ్ నాకు చాలా యిష్టం. సుహాస్ వాయిస్‌ని ఎంతో ఇష్టపడతాను. హీరోయిన్ చాందిని చాలా బాగా నటించింది. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.." అని తెలిపారు.

Advertisement
Advertisement