Abn logo
Mar 26 2020 @ 07:00AM

ఈ ఫన్నీ మీమ్ చూస్తే బయటకు వెళ్ళరు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వినాశనం సృష్టిస్తూనే ఉంది. ప్రధాని నరేంద్ర  మోదీ మార్చి 24 న 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. దీనిని పర్యవేక్షించడంలో  పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ తారలు తమ అభిమానులతో రోడ్ల మీదకు వెళ్లకుండా సురక్షితంగా ఉండమని  చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా  చిత్రాలు, వీడియోలు పంచుకుంటూ ప్రజలు సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాలీవుడ్ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ విభిన్న శైలిలో తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులకు సందేశం ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇందులో సునీల్ గ్రోవర్ పొడవాటి జుట్టుతో కింద కూర్చొని నవ్వులు పండిస్తూ కనిపిస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రజలు తమ రోజువారీ సామగ్రి కొనుగోలుకు దుకాణాలకు తరలివచ్చారు. రేషన్, మెడికల్ స్టోర్లలో పెద్ద లైన్లు కనిపించాయి. ఇది పూర్తిగా సామాజిక దూరం అనే నిబంధనను  ఉల్లంఘించినట్లే అవుతుంది. చాలా మంది దీనిని బహిరంగంగా వ్యతిరేకించారు. 

https://www.instagram.com/whosunilgrover/?utm_source=ig_embed


Advertisement
Advertisement
Advertisement