Abn logo
Oct 31 2020 @ 19:05PM

రౌడీ అవతార్‌లో.. అక్కినేని కుటుంబ హీరో

Kaakateeya

అక్కినేని కుటుంబ హీరో సుమంత్ కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమంత్‌ని ప్రేక్షకులు హీరోగానే చూశారు. హీరోగా సుమంత్‌ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. సరైన హిట్‌ చిత్రం ఆయన నుంచి వచ్చి చాలా కాలం అయింది. అందుకేనేమో.. జగ్గూభాయ్‌ అదే జగపతిబాబులా ఇప్పుడు విలన్‌ అవతారం ఎత్తుతున్నాడు. జగపతిబాబు కూడా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నా.. హిట్‌ సినిమాలు రాకపోవడంతో.. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ఎటువంటి స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. పలు లాంగ్వేజ్‌లలో నటిస్తూ.. జగపతిబాబు ఇప్పుడు బిజీబీజీ నటుడిగా మారిపోయారు. తాజాగా సుమంత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన పిక్‌ చూస్తే.. జగపతిబాబునే ఆదర్శంగా తీసుకున్నాడా? అని అనిపించక మానదు.


'అనగనగా ఒక రౌడీ' అంటూ.. గుబురు గడ్డంతో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఫొటోని సుమంత్‌ సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో షేర్‌ చేశారు. మరి ఆయన రౌడీగా ఏ చిత్రంలో చేస్తారనేది మాత్రం చెప్పలేదు. అంతకుముందు కూడా తనకు విలన్‌గా చేయాలని ఉందని పలుమార్లు సుమంత్‌ చెప్పుకొచ్చారు. ఇప్పుడాయన కోరిక తీరబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పిక్‌పై 'ఇంత కాలానికి మంచి డెసిషన్‌ తీసుకున్నావ్‌', 'లుక్‌ సూపర్‌' అని నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం.


Advertisement
Advertisement