Abn logo
Apr 3 2020 @ 08:11AM

టైటిల్ విష‌యంలో అదే ఫార్ములా.. బ‌న్నీ పుట్టిన‌రోజున అభిమానుల‌కు ట్రీట్ !!

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన సుకుమార్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో క‌లిసి మూడోసారి ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్య‌, ఆర్య 2 చిత్రాలు రూపొందాయి. మూడోసారి కూడా సుకుమార్ టైటిల్ విష‌యంలో త‌న పాత స్టైల్‌నే ఫాలో అవుతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. అంటూ బ‌న్నీ, సుక్కు కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమాకు రెండు అక్ష‌రాల టైటిల్‌నే పెట్ట‌బోతున్నారంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బ‌న్నీ పుట్టిన‌రోజు ఏప్రిల్ 8 సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, లుక్‌ను విడుద‌ల చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని టాక్‌. స‌స్పెన్స్ వీడాలంటే మ‌రికొన్నిరోజులు ఆగాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement