Abn logo
Jun 18 2021 @ 23:04PM

భార్య, బంధువుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

జంగారెడ్డిగూడెం, జూన్‌ 18: భార్య, బంధువుల వేధింపులతో మనస్తాపం చెంది లేఖ రాసి యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేగవరంలో జరిగిన సంఘటన వివరాలు పోలీ సులు తెలిపారు. కడలి రామ దుర్గాప్రసాద్‌ (31) తన ఇంట్లో ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసు కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు లు సంఘటన స్ధలాన్ని పరిశీలించి సూసైడ్‌ లెటర్‌ను గుర్తించారు. మృతుడి భార్య గుత్తుల నాగలక్ష్మి, ఆమె బంధువులైన గుత్తుల దుర్గాప్రసాద్‌, అనసూరి వెంకట తాతా రావు, యాండ్ర మురళీకృష్ణ, గుత్తుల మోహనరావు, గుత్తుల దుర్గాప్రసాద్‌ తనను మానసికంగా వేధించారని లేఖలో పేర్కొన్నాడు. తన పిల్లలను చూడడానికి కూడా ఇబ్బంది పెట్టేవారని, తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఈ కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో రాశాడు. లేఖలో పేర్కొన్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దుర్గా ప్రసాద్‌ మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.