Abn logo
Oct 13 2021 @ 00:10AM

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

నిజాంసాగర్‌, అక్టోబరు 12: సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన కమ్మరి లింగవ్వ, బ్రహ్మయ్యల ఏకైక కుమారుడు  కమ్మరి రమేష్‌(22) ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిజాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్ప డినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. గజ ఈత గాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అక్క డి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. అయితే, మృతుడి తల్లిదండ్రులు రామిరెడ్డిపేటలో పాలేర్లుగా పని చేస్తుండగా, రమేష్‌ దినసరి కూలీ గా బాచేపల్లిలోనే రైస్‌మిల్లులో పనిచేస్తూ ఉండే వాడు. ఆర్థిక ఇబ్బందులే కాకుండా పెళ్లి కాలేదని తీవ్ర మనస్థానం చెందేవాడని గ్రామస్థులు తెలిపారు. అంతేకాకుండా రమేష్‌ ఒక్కడే గ్రామం లో ఉంటూ ఇరుగుపొరుగు వారి వద్ద పనిచేస్తూ మద్యానికి బానిసై ఇంట్లో వంట సైతం చేసుకోక ఆకలితో అలమటించేవాడని స్థానికులు తెలిపారు. నిరుపేద కుటుంబమైన రమేష్‌ తల్లిదండ్రులు పాలేర్లుగా పనిచేస్తూ ఉండేవారని, వారి వద్ద రమేష్‌ ఉండకుండా, స్వగ్రామంలోనే ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్లనే పాలేర్లుగా ఉన్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవ పంచనామా నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడకు తర లించినట్లు ఎస్సై తెలిపారు.