Abn logo
Apr 6 2020 @ 22:20PM

లండన్ నుంచి వచ్చిన మా అబ్బాయి ఇంత వరకూ.. : సుహాసిని

ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం ఎంత అవసరమో నటి సుహాసిని తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన సుహాసిని, ఈ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఉదాహరణతో సహా తెలిపారు. లండన్ నుంచి వచ్చిన వాళ్ల అబ్బాయి ఇంత వరకు వాళ్లని చూడలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు.


‘‘మనం అందరం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉన్నాం. కానీ ధైర్యంగా ఉండాలి. భయపడవద్దు. ఈ కరోనా వైరస్ మనల్ని ఇబ్బంది పెట్టింది. చిన్నా, పెద్దా అనే తేడాలు లేకుండా ఎవరినీ వదలలేదు. ఇప్పుడు ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఏదైనా షాపింగ్‌కి వెళ్లేట్లు అయితే ఒక్కరే వెళ్లండి. చాలా ఓపికగా ఉండండి. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉండండి. మీ ఫ్యామిలీతో గడపండి. నవ్వుతూ గడపండి. దయచేసి నా అభ్యర్థనను అందరూ పాటించండి. మా బాబు నందన్. మార్చి 18న లండన్ నుంచి వచ్చాడు. కానీ ఇంత వరకు పైకి వచ్చి వాళ్ల నాన్నని చూడలేదు, అమ్మమ్మతాతయ్యలను చూడలేదు. మా నుంచి భౌతిక దూరం పాటిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మా నాన్నకి 90 సంవత్సరాలు అలాగే మా అమ్మకి 75 సంవత్సరాలు. వాళ్లని ఇంకొంతకాలం ఆనందంగా చూడాలి అనుకుంటే ఈ భౌతిక దూరం తప్పదు. అందుకే దయచేసి వినండి.. అందరూ ఇంటిపట్టునే ఉండి భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి..’’ అని సుహాసిని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement