కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోందట. సుదీప్ హీరోగా సుజిత్ ఓ సినిమాను రూపొందించనున్నాడట. సుదీప్‌కు ఇటీవల సుజిత్ ఓ లైన్ వినిపించాడట. ఆ లైన్ నచ్చడంతో పూర్తి కథ సిద్ధం చేసుకుని రమ్మని సుజిత్‌కు సుదీప్ సూచించాడట. ప్రస్తుతం సుజిత్ ఆ పనిలోనే బిజీగా ఉన్నాడట.
`రన్ రాజా రన్`, `సాహో` చిత్రాలతో సుజిత్ జాతీయ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అటు సుదీప్ కన్నడంతోపాటు తెలుగు, హిందీ భాషల చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా రూపొందనుందని సమాచారం. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.