Advertisement
Advertisement
Abn logo
Advertisement

పథకాల ప్రగతిపై సబ్‌కలెక్టర్‌ ఆరా..

ఇబ్రహీంపట్నం, నవంబరు 30: ఇబ్రహీంపట్నం సచివాయం-4ను మంగళవారం సబ్‌కలెక్టర్‌ జి.సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలు, టీకా డ్రైవ్‌, ఓటీఎస్‌, హౌసింగ్‌, పాలవెల్లువ పథకాల ప్రగతి తీరును అడిగి తెలుసుకున్నారు. బియ్యం కార్డు ఆధార్‌ నంబర్‌ సరిపోలన అన్ని కేసులపై ఏకీకృత నివేదికను సమర్పించాలని అటువంటి కేసుల పరిష్కారాన్ని కనుగోనడానికి రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని సిబ్బందిని ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ పథకాన్ని పరిశీలించారు. ఈ సమయంలో లబ్దిదారుల డేటాను సమీకరించడంలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఆయన ఆరా తీశారు. తహసీల్దార్‌ ఎం.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement