Abn logo
Aug 1 2021 @ 00:36AM

నిర్ణీత సమయంలో దరఖాస్తులు పరిష్కరించాలి

సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

నిర్ణీత సమయంలో దరఖాస్తులు పరిష్కరించాలి

సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌

పాయకాపురం, జూలై 31 : ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలాగా సచివాలయ సిబ్బంది పని చేయాలని సబ్‌ కలెక్టర్‌ జీఎస్‌ఎన్‌ ప్రవీణ్‌ చంద్‌ సూచించారు. పాయకాపురం పరిధిలోని 262, 268, 269 సచివాలయాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ చంద్‌ సచివాయ సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయంలో డిస్‌ప్లే బోర్డులు తప్పనిసరిగా అందరికి కనబడేటట్లుగా ఉంచాలని చెప్పారు. సచివాలయ సేవలకు సంబంధించి అన్ని దరఖాస్తులు నిర్ణీత వ్యవధిలోనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.