Abn logo
Dec 1 2020 @ 23:57PM

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 1: కరోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలలు మూత బడడంతో విద్యకు దూరమైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయని వీటిపై దృష్టి సారించాలని సెక్టోరల్‌ అధికారి కంటె నర్సయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ, ప్రాథమిక పాఠశాల, మహాలక్ష్మివాడలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు తాటిగూడలోని ఉన్నత, ప్రాథమిక పాఠశా లను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రతిరోజూ టీ సాట్‌, దూరదర్శన్‌, యాదగిరి చానల్స్‌ ద్వారా ప్రసారమయ్యే పాటాలను, వాటికి సంబంధించిన వర్క్‌షీట్లను విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. అంతేకాకుండా విద్యార్థులను ఆన్‌లైన్‌ తరగతుల వివరాలను అడిగి తెలుసుకొని వారి డైరీలను పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేసుకొని వారికి అవ సరమైన పాఠ్య పుస్తకాలను, యూనిఫాం క్లాత్‌లను ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, పాఠ్య పుస్తకాలను ఆయన పరిశీలించారు. సెక్టోరల్‌ అధికారితో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గణేష్‌కుమార్‌, మెరుగు రాజు, కిరణ్‌, రవికాంత్‌, పొచ్చరెడ్డి, జనార్దన్‌, ప్రదీప్‌, స్వర్ణలత, గిరీష్‌కుమార్‌, శారదా తదితరులున్నారు.

Advertisement
Advertisement