Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాముకాటుతో విద్యార్థిని మృతి

మైదుకూరు, నవంబరు 27 : మండలంలోని తిప్పిరెడ్డిపల్లెకు చెందిన కోటయ్యగారి గురు కవిత (18) అనే విద్యార్థిని పాము కాటుకు గురై మృతి చెందింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కవిత శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఆరు బయట కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. వెంటనే కడపలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందిందని  తెలిపారు. కాగా కవిత మైదుకూరులోని మేధా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆ కళాశాలలోని స్నేహితులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement