Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘అగ్రి’ అంకుర సంస్థలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

వ్యవసాయ వర్సిటీ ఈసీ సభ్యుడు మురళీనాఽథరెడ్డి

16 మందికి తొలివిడతలో రూ.64.4 లక్షల చెక్కులు పంపిణీ


తిరుపతి(విద్య), డిసెంబరు 6: వ్యవసాయ అనుబంధ రంగాల్లో అంకురసంస్థల ఏర్పాటు ద్వారా రైతులసమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేయొచ్చని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయవర్సిటీ పాలకమండలి సభ్యుడు టీవీ మురళీనాథరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని ప్రాంతీయవ్యవసాయ పరిశోధనాస్థానంలో ఉన్న అగ్రిబిజినెస్‌ ఇంక్యుబేటర్‌ కేంద్రంలో శిక్షణ పొందిన బృందంలో సోమవారం 16మందికి అంకురసంస్థలు ఏర్పాటుకు తొలివిడతగా రూ.64.4 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఫ్రీసీడ్‌ స్టేజ్‌లో 12మందికి రూ.33.6లక్షలు, సీడ్‌స్టేజ్‌ విభాగంలో నలుగురికి రూ.30.8లక్షలను అందించారు. ఈ సందర్భంగా మురళీనాథరెడ్డి మాట్లాడుతూ.. అంకుర సంస్థల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించవచ్చని తెలిపారు. ప్రతినిత్యం మార్కెట్‌లో పరిణామాలు, వినియోగదారుల ప్రాధాన్యతలు గుర్తించినప్పుడే నిలదొక్కుకోగలరని ప్రిన్సిపల్‌ రవీంద్రనాథరెడ్డి సూచించారు. తిరుపతికి చెందిన డాక్టర్‌ శ్రీదేవికి సమృద్ధి విభాగంలో అంకురసంస్థ ఏర్పాటుకు రూ.20లక్షలు మంజూరు కాగా, తొలివిడతలో రూ.8లక్షల చెక్కును అందుకున్నారు. ఈమె సీఎ్‌సఎల్‌ బయోటెక్‌ స్టార్టప్‌ ద్వారా ఫ్రూట్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు, మార్కెట్‌యార్డ్‌ల ద్వారా ఫ్రూట్‌ వ్యర్థాలను కన్వర్ట్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో రెండునెలల పాటు శిక్షణ పొంది వేస్ట్‌మేనేజ్‌మెంట్‌పై మరింత అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి, ఇంక్యుబేటర్‌ కేంద్రం ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.బాలహుస్సేన్‌రెడ్డి, కోప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌, శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement