Abn logo
Jul 10 2020 @ 05:41AM

స్టాక్‌ పాయింట్లలో నిల్‌.. బ్లాక్‌లో ఫుల్‌ !

జిల్లాలో కొనసాగుతున్న ఇసుక దందా

తూర్పులో ఒక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో..

గోపాలపురం ర్యాంపు నుంచి పశ్చిమకు రవాణా

బ్లాక్‌లో 5 యూనిట్లు రూ.32 వేలు

గోదావరి వరదతో మూతపడుతున్న ర్యాంపులు


పాలకొల్లు, జూలై 9: జిల్లాలోని ఇసుక స్టాక్‌ పాయిం ట్లలో ఇసుక లభించడం గగనమైపోయింది. గోదావరికి వరద పోటుతో పలు ర్యాంపులు మూతపడుతున్నాయి.  ఆచంట మండలం కోడేరు ర్యాంపులో మైనింగ్‌ అధికారులు దుకాణం సర్దేశారు. గోదావరి వరద నీటితో నిండడంతో ఇసుక తీసే మార్గంలేక ఇక్కడ స్టాక్‌ పాయింట్లో ఇసుక నిల్వలు ఖాళీ అయ్యాయి. జిల్లాలోని అధిక శాతం ఇసుక స్టాక్‌ పాయింట్లలో పరిస్థితి ఇదే.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుని సకాలంలో ఇసుక అందక వినియోగదారులు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే..మరోవైపు బ్లాక్‌ మార్కెట్లో ఇసుక కావలసినంత లభ్యం అవుతున్నది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ర్యాంపు నుంచి రోజుకు 50-60 లారీలు ఇసుక అక్రమంగా పశ్చిమకు ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. 5 యూనిట్ల ఇసుక జిల్లాలో రూ.30-32వేలకు విక్రయిస్తున్నారు. సిద్దాంతం బ్రిడ్జి మీదుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు చెబుతున్నారు. తూర్పు గోదా వరి నుంచి పశ్చిమకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ముఠా వెనుక తూర్పుకు చెందిన ఒక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.


ప్రజాప్రతినిధి హుకుం జారీ చేయడంతో జిల్లాస్థాయి అధికారులు, మైనింగ్‌ అధికారులు మౌనంగా ఉండిపోతున్నారనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయ. ఇటీవల ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూ రోగా పేరు మార్చి ఇసుక అక్రమ రవాణాలను అరికట్టే పనిని అప్పగించారు. ఈ పనిలో సంబంధిత అధికారులు క్యూబిక్‌ మీటరు లేదా కొద్దిపాటి మూటలతో ఇసుకను తర లించే చిన్న తరహా రవాణా వాహనాలను అదుపు చేయడం, సీజ్‌ చేయడంలో సఫలమయ్యారు. ఇసుకాసు రులను వదిలేసి చిన్న పాటి అవసరాలకు ఇసుకను తెచ్చు కునే వారిపై కేసులు నమోదు చేయడం చూస్తుంటే తిమిం గలాలను వదిలేసి, చేపపిల్లలను వేటాడిన చందంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. గోపాలపురం ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లాకు చెందిన పలువురు లారీ యజమానులు, ఇసుక వినియోగదార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. 


జిల్లాలో అక్రమ తవ్వకాలు....

జిల్లాలోని జీడిగుంట, పెండ్యాల, ఉసులుమర్రు ర్యాం పులలో రాత్రి సమయాలలో లారీల కొద్దీ ఇసుకను అక్ర మంగా తవ్వి తరలిస్తున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు పలు ర్యాంపుల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక 5 యూనిట్లు రూ.32 వేలకు విక్రయిస్తున్నారు. పలు ర్యాంపు లలో గోదావరినుంచి సేకరించిన ఇసుకలో మూడొం తులు నల్లబజారుకు తరలుతుండగా ఒక వంతు మాత్రమే ప్రభుత్వ స్టాక్‌ పాయింట్లకు వెళుతున్నట్లు సమాచారం.


ర్యాంపులు మూసివేత

పెనుగొండ మండలం సిద్దాంతం, నిడదవోలు మండలం పెండ్యాల, జీడిగుంట, పెరవలి మండలం ఉసులుమర్రు, ఖండవల్లి, ఆచంట మండలం కోడేరు ర్యాంపులను వరదల కారణంగా మూసివేశారు.


కోడేరు ర్యాంప్‌లో వరద నీరు

ఆచంట, జూలై 9: మండలంలోని కోడేరు ఇసుక స్టాక్‌ పాయింట్‌లో ఇసుక లేదు. ప్రస్తుతం ర్యాంప్‌లో వరదనీరు చేర డంతో మైనింగ్‌ అధికారులు కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక పోలీసు కానిస్టేబుల్‌ స్టాక్‌ పాయింట్‌ వద్ద కాపలా ఉన్నారు.  కొంతమంది గురువారం ర్యాంప్‌ వద్దకు వచ్చారు. ర్యాంప్‌ వద్ద ఎవరూ లేకపోవడం, స్టాక్‌ ఖాళీ కావడంతో వినియోగదారులు బోదిబోమన్నారు. కోడేరులో ఇసుక ఉన్నట్లు ఈ  నెల 8న ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నామంటూ ఒక వినియోగదారుడు రశీదు ప్రదర్శించారు. కోడేరు ర్యాంప్‌ నుంచి ఇసుక కోసం బుక్‌ చేసుకుని సుమారు 20 రోజులు పైగా అయ్యింది. ఈ రోజువరకు సరఫరా చేయలేదు. ర్యాంప్‌ వద్దకు వచ్చి చూస్తే ఇసుక లేదు. అధికారులు లేరంటూ ఇసుక బుకింగ్‌ చేసుకున్న కన్నా నాగమణి వాపోయింది. దీనిపై మైనింగ్‌ అధికారి చంటిబాబు మాట్లా డుతూ కోడేరు ర్యాంప్‌ వద్ద ఇసుక స్టాక్‌ పూర్తిగా అయిపోయింది. 1200 డీడీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.  

Advertisement
Advertisement
Advertisement