చింతకుంటలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ధారూరు: గ్రామాల్లో సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. అపరిష్కృత సమస్యలను తన దృషికి తీసుకురావాలని సూచించారు. ధారూరు, చింతకుంట గ్రామాల మద్య అసంపూర్తి వంతెన సమస్య మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టిలో ఉందని ఆయన చెప్పారు. గ్రామంలోని కొన్ని విద్యుత్ స్తంబాలకు విద్యుత్‌షాక్ వస్తుందని గ్రామస్థులు ఎమ్యెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఒకే ఆన్, ఆఫ్ సిస్టమ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేకు వివరించారు. మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు నిర్మించాలని, 200మీటర్ల భగీరథ పైపులైన్ అవసరమని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ సుజాత, సర్పంచ్ లక్ష్మమ్మ, వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్, పీఎసీఎస్ చైర్మన్లు వై.సత్యనారాయణరెడ్డి, పి.వెంకట్‌రెడ్డి, వైస్చైర్మన్లు రాజునాయక్, క్రిష్ణలు, ఎఎంసీ చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ రాజుగుప్త, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.