Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేతన బకాయిలపై 16న ఉక్కు కార్మికుల సమ్మె

సీఎండీకి నోటీసు ఇచ్చిన గుర్తింపు యూనియన్‌  

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 2: స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు  వేతన బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై గుర్తింపు యూనియన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  చెల్లింపులపై తక్షణం చర్యలు తీసుకోకుంటే ఈనెల 16న సమ్మె చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌కు గుర్తింపు యూనియన్‌ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. సెయిల్‌ కార్మికులకు వేతన బకాయిలు అందాయని, అదేక్రమంలో ఇక్కడి కార్మికులకు చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వైటీ దాసు మాట్లాడుతూ   బకాయిల చెల్లింపుపై యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో జె.సింహాచలం, బొడ్డు పైడిరాజు, సీహెచ్‌.సన్యాసిరావు, చంద్రరావు, ఎం.మహాలక్ష్మినాయుడు, జీఆర్‌కే నాయుడు, యు.రామస్వామి, టీవీకే రాజు, యు.వెంకటేశ్వర్లు, మరిడయ్య ఉన్నారు. Advertisement
Advertisement