Abn logo
Oct 20 2020 @ 00:01AM

రాజకీయ ఎదుగుదలకే రాష్ట్ర స్థాయి పదవి

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 19 : నియోజకవర్గంలో చేనేత వర్గాలు రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేనేత వర్గానికి చెందిన జింకా విజయలక్ష్మికి రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.

సోమవారం పద్మశాలీయ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జింకా విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపఽథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లును గజమాలతో సత్కరించారు.  పద్మశాలీయ కార్పొరేషన్‌ చైర్మన్‌ జింకా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేనేతల అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు బంగారురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement