Abn logo
Jun 3 2020 @ 04:27AM

నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

గద్వాల రూరల్‌, క్రైం, టౌన్‌, జూన్‌ 2 :  జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను మంగళవారం నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంపై జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, గద్వాల మునిసిపాలిటీ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ పతాకాన్ని ఎగురవేశారు. గద్వాల ఎంపీడీఓ కార్యాలయంపై ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, పీఏసీయస్‌ కార్యాలయంపై చైర్మన్‌ ఎంఏ సుబాన్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.


జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ కృష్ణ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. తహసీల్దార్‌ కార్యాలయంపై తహసీల్దార్‌ మంజుల, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌పై ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, డీటీఓ కార్యాలయంపై పురుషోత్తం రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాజీ మంత్రి డీకే సరమసింహరెడ్డి బంగ్లాలో డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు అలూరు ప్రకాష్‌గౌడ్‌, నడిగడ్డ రైతుల హక్కుల పోరాట సమితి కార్యాలయంలో చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌ జాతీయ జెండాను అవిష్కరించారు. విశిష్ఠ నోబుల్‌ పాఠశాల వద్ద డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్డీసీ బస్టాండ్‌లో డీఎం రాంమోహన్‌ జాతీయ జెండాను ఎగరవేశారు.


ధరూరు : ధరూరులో జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నజుమున్నిసాబేగం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్‌పర్సన్‌ మహదేవమ్మ, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దారర సుందర్‌ రాజు, ఎంపీడీఓ జబ్బార్‌, ఎంఈఓ సురేష్‌, ఏఈఓ శ్రీలత, ఎంపీటీసీ శివలీల పాల్గొన్నారు.


ఉండవల్లి : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ లక్ష్మి, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై విజయ్‌కుమార్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బీసమ్మ, ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓ శివప్రసాద్‌, పంచాయతిలో సర్పంచు రేఖా జాతీయ జెండాను ఎగురవేశారు.


అయిజ : పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు తహసీల్దార్‌ యాదగిరి, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీడీఓ రమణారావు, వ్యవసాయ కార్యాలయం ముందు ఏఓ శంకర్‌లాల్‌, పోలీస్‌స్టేషన్‌ ముందు ఎస్‌ఐ జగదీష్‌, మునిసిపల్‌ కార్యాలయం ముందు చైర్మన్‌ దేవన్న, సింగిల్‌విండో  కార్యాలయం ముందు అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వాసుపత్రి ఎదుట డాక్టర్‌ రామలింగారెడ్డి జెండాను ఆవిష్కరించారు.


వడ్డేపల్లి : మునిసిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కరుణ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆంజనేయులు, దేవేంద్రమ్మ, ధనలక్ష్మి, సుజాత, లలితమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు. 


ఇటిక్యాల : ఎర్రవల్లి చౌరస్తాలోని పదవ పోలీస్‌ బెటాలియన్‌లో కమాండంట్‌ జమీల్‌బాషా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఆదినారాయణ, దర్మ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద అధ్యక్షుడు ధర్మారెడ్డి జెండాను ఎగురవేశారు. 


రాజోలి : మండలంలోని చేనేత సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు దోత్రెనారాయణ జెండా ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ వెంకటేశ్వరమ్మ గోపాల్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మరియమ్మ నతానియేలు, తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ వెంకటరమణ ఆవిష్కరించారు.


Advertisement
Advertisement