Abn logo
Jul 7 2020 @ 08:52AM

సుశాంత్ పేరు మీద న‌క్ష‌త్రం

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య ఆయ‌న అభిమానుల‌కు తీర‌ని బాధ‌ను మిగిల్చింది. ఈ త‌రుణంలో ఓ అభిమాని సుశాంత్ కోసం అరుదైన ప‌ని చేసి నివాళి అందించారు. అదేంటంటే..అమెరికాలో ఉండే ర‌క్ష అనే అభిమాని ఖ‌గోళ శాస్త్ర సంస్థ నుండి ఓ న‌క్ష‌త్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ అనే పేరు పెట్టారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ కాపీని కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు ర‌క్ష‌. ‘సుశాంత్‌కు నివాళులు అర్పించ‌డంలో ఆల‌స్యం చేశాను. త‌నొక అద్భుత‌మైన వ్య‌క్తి.. స్వ‌చ్ఛ‌మైన ర‌త్నం. ఆయ‌న పేరు మీద ఓ న‌క్ష‌త్రాన్ని కొన‌డం సంతోషంగా ఉంది. ఆ తార మ‌రింత‌గా మెర‌వాలి. ఆ తార‌కు సంబంధించిన హ‌క్కులు, కాపీరైట్స్ ల‌భించాయి’ అని ర‌క్ష తెలిపారు. సుశాంత్‌కు ఖ‌గోళ ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ఓ ఖ‌రీదైన టెలిస్కోప్‌ను కూడా కొని స‌మ‌యం ఉన్న‌ప్పుడ‌ల్లా ఆకాశంలో న‌క్ష‌త్రాల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తుంటారనే సంగ‌తి ఆయ‌న స‌న్నిహితులు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement