Abn logo
Dec 2 2020 @ 09:44AM

బిగ్‌బాస్‌4పై షాకింగ్ డిసిషన్ తీసుకున్న ఛానెల్‌

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4. ఇప్పటికే పన్నెండు వారాలు పూర్తయ్యాయి. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్‌ 4 పూర్తి కానుంది. ఈ షో విషయంలో సంబంధిత స్టార్‌ మా ఛానెల్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయమేంటి? సాధారణంగా బిగ్‌బాస్‌.. వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రసారమవుతుంది. వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి తొమ్మిది గంటలకే ప్రసారమవుతుంది. కానీ ఇప్పుడు ఈ టైమింగ్‌ను మార్చారు. రెగ్యులర్‌గా రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ ఇకపై పది గంటలకు ప్రసారం చేయాలని ఛానెల్‌ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. అందుకు తగినట్లు రాత్రి 9.30 గంటలకు వదినమ్మ సీరియల్‌ను ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటనను కూడా వెలువరిచారు. ఇక వీకెండ్స్‌(శని, ఆదివారం)లో మాత్రం ఎప్పటిలాగానే రాత్రి 9 గంటలకే బిగ్‌బాస్‌ 4ను ప్రసారం చేస్తారట. ఓ కొత్త సీరియల్‌ ఒకటి లిస్టులో చేరడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement