Abn logo
Nov 30 2020 @ 08:26AM

మ‌నోజ్ మూవీలో చేయ‌బోయే స్టార్ ఎవ‌రు?

మంచు మ‌నోజ్ హీరోగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘అహం బ్ర‌హ్మాస్మి’. ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్‌లో చాలా కీలకంగా ఓ పాత్ర ఉంటుంద‌ని, ఆ పాత్ర కోసం మ‌నోజ్ ఓ స్టార్ హీరోని సంప్ర‌దిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి మ‌నోజ్ కోసం ‘అహం బ్ర‌హ్మాస్మి‘లో న‌టించ‌బోయే స్టార్ ఎవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎంఎం ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతుంది. 

Advertisement
Advertisement
Advertisement