Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టాండింగ్‌ కమిటీ ఏకగ్రీవం

అధికారికంగా ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

నామినేషన్లు ఉపసంహరించుకున్న ఆ ముగ్గురు

టీఆర్‌ఎస్‌ అగ్రనేతల సూచనతో వెనక్కి


హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి నిర్ణీత సంఖ్యకు మించి నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో మిగతా 15 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రకటించారు. పాలకమండలి కొలువుదీరిన తొమ్మిది నెలలకు స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక జరిగింది. పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌ నుంచి ఎనిమిది మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు సభ్యులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యుల ఎన్నికకు ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్‌ ప్రకటించారు. 3 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. టీఆర్‌ఎస్‌ నుంచి 11 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మాదాపూర్‌ కార్పొరేటర్‌ వీ జగదీశ్వర్‌గౌడ్‌, శేరిలింగంపల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌, సోమాజిగూడ కార్పొరేటర్‌ వనం సంగీత యాదవ్‌లు ఉపసంహరించుకున్నారు. అధిష్ఠానం ఆదేశాల నేపథ్యంలోనే వారు పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. ఎన్నికైన సభ్యులు యేడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. అనంతరం తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. 


అభివృద్ధికి అవాంతరం లేకుండా..

గ్రేటర్‌ అభివృద్ధిలో స్టాండింగ్‌ కమిటీ కీలకం. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అధికారం సభ్యులకు ఉంటుంది. కమిషనర్‌ స్థాయిలో రూ.2 కోట్ల విలువైన పనులకు ఆమో దం తెలుపవచ్చు. ఈ అధికారాన్ని వికేంద్రీకరణలో భా గంగా జోనల్‌ కమిషనర్లకు బదలాయించారు. రూ.3 కోట్ల వరకు విలువైన పనులకు ఆమోదం తెలిపే అధికారం స్టాండింగ్‌ కమిటీకి ఉంటుంది. రూ.6 కోట్ల వర కు కౌన్సిల్‌లో, అంతకంటే ఎక్కువ విలువైన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలి. కౌన్సిల్‌  సమావేశంలో మూడు, నాలుగు నెలలకోసారి మాత్ర మే జరిగే అవకాశమున్న దృష్ట్యా.. అభివృద్ధి పనులకు అవాంతరం లేకుండా ప్రతి వారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు ఆమోదిస్తుంది.


స్టాండింగ్‌ కమిటీ సభ్యులు

కుర్మ హేమలత

పన్నాల దేవేందర్‌రెడ్డి 

పర్వీన్‌ సుల్తానా

వై.ప్రేమ్‌ కుమార్‌ 

బతా జబీన్‌

మహాపర 

మందగిరి స్వామి 

మందాడి శ్రీనివాసరావు

మీర్జా ముస్తఫా బేగ్‌

మహ్మద్‌ అబ్దుల్‌ సలామ్‌ షాహిద్‌

మహ్మద్‌ రషీద్‌ ఫరాజుద్దీన్‌

రావుల శేషగిరి ఫ సీఎన్‌ రెడ్డి 

ఈ విజయకుమార్‌గౌడ్‌

సామల హేమ

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement