Abn logo
Apr 6 2020 @ 05:45AM

సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి : ఎస్పీ

కడెం, ఏప్రిల్‌ 5 : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కష్టపడుతున్న పోలీసులు విధి నిర్వహణలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. ఆదివా రం కడెం పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బందికి శానిటైజర్‌, మాస్క్‌లు, వో ఆర్‌ఎస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.


వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త లు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేం దుకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, కూరగాలయ మార్కెట్‌లో మూడు అడుగుల భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100కు లేదా వాట్సాప్‌ నెంబర్‌ 9440900680కు కాల్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్‌ సీఐ జైరాంనాయక్‌, ఎస్సైలు భవాని సేన్‌ గౌడ్‌, ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement