Abn logo
May 22 2020 @ 22:36PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఎస్.ఎస్. రాజమౌళి

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించేందుకు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం ప్రగతిభవన్‌లో కలిశారు. సినీ ప్రముఖులు తెలిపిన విషయాలన్నింటి విన్న కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ.. టాలీవుడ్ కోసం త్వరలోనే సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీకి సెలబ్రిటీలందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.


‘‘సినిమా షూటింగ్‌ల విషయంలో సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మేం చెప్పిన ప్రతి విషయం ఎంతో ఓపికగా విని సానుకూలంగా స్పందించారు. మనం అందరం ఎక్కువగా ఇష్టపడేదాని కోసం అతి త్వరలో ఒక తీర్మానాన్ని తీసుకువస్తానని ఆయన వాగ్దానం చేసారు. దీనిని సీఎంగారి దృష్టికి తీసుకెళ్లడానికి తోడ్పాటునందించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిగారికి ధన్యవాదాలు..’’ అని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement