కమల్‌హాసన్ తనయ, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఓ ఛాలెంజింగ్ రోల్లో నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ శ్రుతిహాసన్ చేయనున్న పాత్ర ఏంటా? అని అనుకుంటున్నారా? ఓ సీనియర్ స్టార్ ప్రేయసి పాత్రలో కనిపిచనుందట. వివరాల మేరకు 'ది బెస్ట్ సెల్లర్ షఈ రోట్ అనే నవలను ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. సూపర్‌స్టార్ అయిన నవలా రచయితకు, అతని యువ ప్రేయసికీ మధ్య జరిగే కథ. ఇందులో సూపర్‌స్టార్ అయిన నవలా రచయితగా మిథున్ చక్రవర్తి నటిస్తుంటే, అతని ప్రేయసిగా శ్రుతి కనిపించనుందట. ముకుల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుంటే, సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఉత్తరాఖండ్‌లో సింగిల్ షెడ్యూల్లో ఈ వెబ్ సిరీస్‌ను పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంఇ పాత్రను చేయడం శ్రుతి హాసన్‌కు ఛాలెంజింగే అని చెప్పాలి. మరి ఈ అమ్మడు ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూడాలి.