Advertisement
Advertisement
Abn logo
Advertisement

తునితో ‘సిరివెన్నెల’కు అనుబంధం

తుని, నవంబరు 30: తునితో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఎంతో అనుబంధం ఉంది. ప్రముఖ విద్యాసంస్థ శ్రీప్రకాష్‌ ఏ ర్పాటు చేసిన వేటూరి సాహితీ పీఠం సప్తమ పురస్కారాన్ని అందుకునేందుకు ఆయన తుని వచ్చారు. పట్టణ ప్రముఖులు ఆయనతో మాట్లాడి ఘనంగా సన్మానించారు. ఆయన హఠాన్మరణంతో పట్టణ ప్రజలు దిగ్ర్భాంతికి లోనయ్యారు.


‘సిరివెన్నెల మరణం తీరనిలోటు’

సామర్లకోట, నవంబరు 30: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మిక మృతి చలనచిత్ర, సాహిత్య రంగానికి తీరనిలోటని సామర్లకోటకు చెందిన సినీ దర్శకుడు కేబీ.ఆనంద్‌ అన్నారు. మంగళవారం సిరివెన్నెల మృతి సమాచారంతో ఆనంద్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆర్‌.నారాయణమూర్తి దర్శకత్వం వహించిన అడవిదివిటీలు చిత్రానికి తాను సహా దర్శకుడిగా వ్యవహరించానన్నారు. ఆ చిత్రంలో తన గురువు ఆర్‌.నారాయణమూర్తి కోరిక మేరకు సిరివెన్నెల పాట రాశారని, అప్పటి నుంచి ఆయనతో తనకు విడదీయరాని బంధం ఏర్పడిందని ఆనంద్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement