Abn logo
Sep 23 2020 @ 17:52PM

మహేష్‌కు ధన్యవాదాలు: శ్రీనువైట్ల

Kaakateeya

సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోని మరపురాని చిత్రాలలో `దూకుడు` ఒకటి`. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొత్త అర్థం చెబుతూ దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధంచింది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన ఈ సినిమా నేటితో (బుధవారం) తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని శ్రీనువైట్ల గుర్తు చేసుకున్నారు. 


`షూటింగ్ సమయంలోనూ, ఆ తర్వాత `దూకుడు` సినిమా ఎన్నో సంతోషకర అనుభవాలను మిగిల్చింది. నా కెరీర్‌లో `దూకుడు` ఓ మైలురాయి. మర్చిపోలేని అనుభవాన్ని అందించిన మహేష్‌కు ధన్యవాదాలు. ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ కృతజ్ఞతల`ని శ్రీనువైట్ల ట్వీట్ చేశారు. `దూకుడు` సినిమా షూటింగ్ నాటి ఫొటోలను పంచుకున్నారు. 



Advertisement
Advertisement
Advertisement