Abn logo
Nov 1 2020 @ 03:17AM

వచ్చే వాల్మీకి జయంతి బీసీ భవన్‌లోనే : శ్రీనివా్‌సగౌడ్‌

రవీంద్రభారతి, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బోయ సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యం లో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ హాజరై బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి వాల్మీకి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటే ప్ర యత్నం చేస్తున్నామని అన్నారు. బీసీ ఆత్మగౌరవ భవనం కోసం ఎకరం భూమితోపా టు భవన నిర్మాణానికి కోటి రూపాయలను కేటాయించామన్నారు. వచ్చే ఏడాది వాల్మీకి జయంతిని బీసీ భవన్‌లోనే నిర్వహించుకుందామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బో య సంఘం అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, తిరుమలేష్‌ నాయుడు, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గంధం రాములు, బోయ గోపి, బొగ్గు వెంకటేష్‌, రేపల్లె కృష్ణమనాయుడు, బొగ్గు రమేష్‌, మూర్తి నాయుడులతోపాటు బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సైదా నాయక్‌, అలోక్‌కుమార్‌, మల్లయ్య బట్టు, చంద్రశేఖర్‌, బాలాచారి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement